: కాన్పూర్ చేరిన టీమిండియా, విండీస్ జట్లు


సిరీస్ ఫలితం తేల్చే చివరి వన్డే కోసం భారత్, వెస్టిండీస్ జట్లు కాన్పూర్ చేరుకున్నాయి. చాలా కాలం తరువాత కాన్పూర్ లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో, నిర్వాహకులు ఇరు జట్ల ఆటగాళ్లకు సంప్రదాయబద్ధంగా, ఘనంగా స్వాగతం పలికారు. టీమిండియా, విండీస్ జట్లు బస చేస్తున్న హోటల్ నిర్వాహకులు ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా కేక్ తయారు చేయించారు. మూడు వన్డేల సిరీస్ లో రెండు జట్లు చెరొక మ్యాచ్ నెగ్గి సమఉజ్జీలుగా నిలవడంతో చివరి వన్డే హోరాహోరీగా జరుగనుంది.

  • Loading...

More Telugu News