: ఐఏఎస్ మన్మోహన్ సింగ్ విచారణ సబబే: అదనపు సొలిసిటర్ జనరల్
జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ విచారణ సబబేనని హైకోర్టుకు అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ భాన్ తెలిపారు. హైకోర్టులో విచారణాధికారం లేకుండా తనను విచారణకు పిలిచారన్న పిటిషన్ పై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తన వాదనలో అప్పటి ప్రభుత్వ కార్యదర్శి అయిన మన్మోహన్ సింగ్ ను విచారించడం సరైనచర్యేనని న్యాయస్థానానికి తెలిపారు.