: కత్రినలా ఉన్నాననడం పెద్ద కాంప్లిమెంట్.. కానీ వద్దు: ఎల్లీ


స్వీడిష్-గ్రీకు నటి ఎల్లీ అబ్రహం తనను కత్రినా కైఫ్ తో పోల్చవద్దంటోంది. 'మిక్కీ వైరస్' చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఎల్లీ 'బిగ్ బాస్-సాత్7'లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలోనే ఒక ఎపిసోడ్ లో సన్నీడియోల్ విచ్చేసినప్పుడు.. 'కత్రినాకైఫ్ ఐదేళ్ల క్రితం ఎలా ఉండేదో అలానే ఉంది' అంటూ ఎల్లీని ఉద్దేశించి వ్యాఖ్యాత సల్మాన్ అన్నారు. దీనిపై ఎల్లీ మాట్లాడుతూ.. 'ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్. నిజంగా కత్రినలా ఉండడం మంచిది.. మధురమైది. కానీ, నేను నన్ను కత్రినతో పోల్చుకోను' అంటూ అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది. 'ఆమె పెద్ద స్టార్.. నేను కొత్తగా వచ్చాను' అని పేర్కొంది.

  • Loading...

More Telugu News