: ప్రజాస్వామ్యంలో ప్రజల ఏకైక ఆయుధం ఓటే: భన్వర్ లాల్
ఓటుపై అవగాహన పెంచుకుంటే సమస్యలు ఉత్పన్నం కావని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అన్నారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం ఓటు హక్కని అన్నారు. జాబితాలో పేరుంటే ఓటు హక్కు వినియోగించుకునే అర్హత ఉంటుందని గుర్తించాలని సూచించారు. నివాసం ఉంటున్న చోటే ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను మార్పు చేయనున్నట్టు భన్వర్ లాల్ తెలిపారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఓటరు నమోదుకు విశేష స్పందన వస్తున్నట్టు ఆయన వెల్లడించారు.