: రాయలసీమ వివరాలతో షిండేను కలసిన కేంద్ర మంత్రి కోట్ల
కేంద్ర హోంమంత్రి షిండేతో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆయన రాయలసీమ జిల్లాల సమాచారం కలిగిన ఫైళ్లను తీసుకెళ్లారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2,300 పంచాయతీలుండగా, అందులో 1,700 పంచాయతీలు రాయల తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని షిండేకు కోట్ల తెలిపారు. ఈ భేటీకి రాష్ట్ర మంత్రి రఘువీరా కూడా హాజరుకావాల్సి ఉందని... కానీ కొన్ని కారణాలతో ఆయన రాలేకపోయారని... ఆయన పంపిన సమాచారాన్ని కూడా తానే షిండేకు అందజేశానని కోట్ల తెలిపారు. రాయల తెలంగాణ అంశం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో, వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.