: అఫ్ఘాన్ లో రేపిస్టులకు రాళ్లతో కొట్టి చంపే శిక్ష?
అఫ్ఘాన్ లో మళ్లీ తాలిబన్ తరహా శిక్షలకు రూపకల్పన జరుగుతోంది. అత్యాచారం కేసులో దోషులను రాళ్లతో కొట్టి చంపే శిక్షను అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి షరియా పీనల్ కోడ్ ముసాయిదా బిల్లుపై పనిచేస్తున్నట్లు షరియా ఇస్లామిక్ లా కమిటీ సభ్యుడు రోహుల్లా ఖరీజదా చెప్పారు. 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ల పాలనలో అప్ఘాన్ లో అత్యాచార నిందితులను కాల్చి చంపడం లేదా రాళ్లతో కొట్టిచంపేవారు. తాలిబన్ల శకం ముగిసి.. అమెరికా ఆధ్వర్యంలోని నాటో దళాల రంగ ప్రవేశంతో ఇలాంటి శిక్షలకు బ్రేక్ పడింది.