: లోకాయుక్త ఎదుట హాజరైన ధర్మాన కుమారుడు
శ్రీకాకుళం జిల్లాలో కన్నెధార గ్రానైట్ లీజు వ్యవహారంలో... మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడుతో పాటు పాలకొండ ఆర్డీవో కూడా లోకాయుక్త ఎదుట హాజరయ్యారు. లీజు వ్యవహారానికి సంబంధించి లోకాయుక్త వీరిని ప్రశ్నించనుంది. ఈ విషయంలో ఎప్పటినుంచో ధర్మాన కుమారుడు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.