: కలిసున్నా, విడిపోయినా నీటి యుద్ధాలు తప్పవు: సీపీఐ నారాయణ
రాష్ట్రం కలిసున్నా, విడిపోయినా నీటి యుద్ధాలు తప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో మరిన్ని కొత్త సమస్యలను సృష్టించవద్దని తాము జీవోఎంకు చెప్పినట్టు గుర్తుచేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. రాయల తెలంగాణ అంశం తమ పార్టీ అజెండాలో లేదని స్పష్టం చేశారు. రాయల తెలంగాణ, విభజన అంశాలపై అభిప్రాయాలు కోరుతూ తమకు ఐబీ నుంచి ఎలాంటి ఫోన్లు రాలేదని అన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని రాజకీయాలకోసం వాడుకుంటున్నారని నారాయణ విమర్శించారు.