: ముంబై మారణ హోమానికి ఐదేళ్లు


అది 2008 నవంబర్ 26. ముంబైలోనే ఖరీదైన తాజ్ హోటల్. సాగర తీరం నుంచి నగరంలోకి అడుగిడిన లష్కరే తాయిబా ఉగ్రవాదులు తాజ్ హోటల్ తోపాటు, శివాజీ టెర్నినస్ ను సమీపించి తుపాకులతో కనిపించిన వారిని పిట్టలు కాల్చినట్లు కాల్చి రక్తం పారించారు. బాంబులతో విధ్వంసం సృష్టించారు.

ఎన్ఎస్ జీ కమెండోలు రంగ ప్రవేశం చేసి 24 గంటల పోరు తర్వాత పాక్ ముష్కరులు 10 మందిని మట్టుబెట్టారు. ఒకే ఒక్క ఉగ్రవాది అజ్మల్ కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. కోర్టు మరణశిక్ష విధించడంతో అతడికి భారత ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. ముష్కరులు పారించిన మారణహోమంలో నాడు 156 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో విదేశీయులు, ముంబై పోలీసులు కూడా ఉన్నారు.

నాటి దారుణానికి ఐదేళ్లు పూర్తయిన సంద్భంగా అమరులైన వారి సేవలను స్మరించుకునేందుకు ముంబై పోలీసులు ఈ ఉదయం జింఖానా వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర సీఎం చౌహాన్ హాజరై అమరులకు నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News