: పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధితులను పరామర్శించనున్నారు. ప.గో.జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో దెబ్బతిన్న వరి, అరటి, తమలపాకు, కొబ్బరి పంటలను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం కృష్ణా జిల్లా చేరుకుంటారు. కృష్ణా జిల్లా పర్యటనలో ఆయన గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల పరిధిలోని తుపాను బాధిత ప్రాంతాలను సందర్శిస్తారు.