: అత్యాచారం, హత్య కేసు నిందితుడికి మరణశిక్ష విధించిన బాంబే హైకోర్టు


మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో బీహార్ కు చెందిన నిందితుడికి శుక్రవారం బాంబే హైకోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేరాన్ని అత్యంత అరుదైన సంఘటనగా భావించిన జస్టిస్ పివి హర్ దాస్, జస్టిస్ ఏఎమ్ థిప్ సే లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పును వెల్లడించింది.

పరిస్థితులను తీవ్రతరం చేసి, అతి దారుణం
గా ప్రవర్తించినందువల్లే కేసును అరుదైన ఘటన కింద తీసుకున్నామని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. 2010 జూన్ లో రాజు జగదీష్ పాశ్వన్ అనే 22 సంవత్సరాల యువకుడు 9 సంవత్సరాల బాలికపై మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక మరణించింది.

  • Loading...

More Telugu News