: ఫేస్ బుక్ లో హయత్ నగర్ యువతికి వేధింపులు
సోషల్ నెటవర్క్ దుర్వినియోగం అవుతోంది. ఆలోచనలు పంచుకోవచ్చనే సదుద్దేశంతో రూపకల్పన చేసిన ఫేస్ బుక్ వేధింపులకు వేదికవుతోంది. తాజాగా హైదరాబాద్ లోని హయత్ నగర్ కి చెందిన ఓ యువతిని ఫేస్ బుక్ ఫ్రెండ్ అని చెప్పి ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. జయసూర్య అనే వ్యక్తి తరచు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ యువతి తండ్రితో కలిసి ఫిర్యాదు చేసింది.