: వైఫల్యాలను నితీష్ ప్రస్తావించలేదు: బీజేపీ
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విడుదల చేసిన రిపోర్ట్ కార్డ్ లో ఆయన తన వైఫల్యాలను పేర్కొనలేదని బీజేపీ నేతలు సుశీల్ కుమార్ మోడీ, నందకిశోర్ యాదవ్ లు విమర్శించారు. పాట్నాలో వారు మాట్లాడుతూ బోధ్ గయ, పాట్నా బాంబు పేలుళ్లను ప్రస్తావించకపోవడం నితీష్ కుమార్ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని విమర్శించారు.