: బండ కార్తీక దంపతుల్లో ఎవరికి 'ఎమ్మెల్సీ' ఇచ్చినా పార్టీకి గుడ్ బై: జయసుధ
హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి దంపతుల్లో ఎవరికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చినా తాను రాజీనామా చేయడం ఖాయమని సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో పదవులు కొనుక్కుంటున్నారని పరోక్షంగా కార్తీకపై ఆరోపణ చేశారు. నిజాయతీపరులను విస్మరిస్తూ అస్మదీయులకే పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. కొందరు వ్యక్తుల వల్ల రాజకీయాలంటే విరక్తి కలుగుతోందని జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు.