: త్వరలో వందలాది కొత్త యూనివర్సిటీలు


దేశంలో త్వరలో 278 కొత్త యూనివర్సిటీలు, 388 కొత్త కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఆర్ డీ శాఖలోని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అశోక్ థాకుర్ తెలిపారు. కొత్త కళాశాలల్లో కొన్నిటిని విశ్వవిద్యాలయాలుగా మార్చవచ్చని బెంగళూరులో జరిగిన ఉన్నత విద్యాశాఖ మంత్రుల ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో ఆయన వెల్లడించారు. 'రాష్ట్రీయ ఉచ్చత్తర్ శిక్షా అభయాన్' (ఆర్ యూఎస్ ఏ)కింద యూపీఏ చేపట్టిన ఈ పథకం కింద విశ్వవిద్యాలయాలను, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 12వ ప్రణాళిక కింద రూ.22,500 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News