: యుక్తాముఖి కేసులో మధ్యవర్తిని నియమించిన బాంబే హైకోర్టు
మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి, ఆమెకు దూరంగా ఉంటున్న భర్త ప్రిన్స్ తులిప్ మధ్య వైవాహిక జీవిత వివాదాన్ని పరిష్కరించేందుకు బాంబే హైకోర్టు సోమవారం మద్యవర్తిని నియమించింది. ఈ మేరకు సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ పాటిల్ సమక్షంలో రేపు చర్చలు జరుగుతాయని తులి తరపు న్యాయవాది ఫిజి ఫ్రడరిక్ తెలిపారు. తులి అసహజ శృంగారం చేస్తున్నారని, అతని కుటుంబ సభ్యులు గృహ హింసకు పాల్పడుతున్నారని గత ఏడాది జూన్ లో పోలీసులకు యుక్తాముఖి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తులి కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ కు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బెయిల్ మంజూరైంది. కేసును న్యాయవాదులతో కలిసి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆదేశిస్తూ మధ్యవర్తిగా రాజీవ్ పాటిల్ ను హైకోర్టు నియమించింది.