: రవీంద్రనాథ్ రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షల పిటిషన్ విచారణ వాయిదా


ఫోర్జరీ కేసులో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు అనుమతించాలని పోలీసులు వేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఈనెల 14కి వాయిదా వేసింది. రవీంద్రానాథ్ రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షతో పాటు బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్ పరీక్షలకు అనుమతివ్వాలని పోలీసులు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ కేసులో రవీంద్రనాథ్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News