: ఈనెల 11న ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు భారత్ రాక


ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఈనెల 11న భారత్ పర్యటనకు రానున్నారు. కిందటి జులైలో కిమ్ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన భారత్ కు రావడం ఇదే తొలిసారి. కిమ్ మూడు రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు.

తన పర్యటన సందర్బంగా ఆయన భారత ప్రధాని మన్మోహన్, ఆర్ధిక మంత్రి చిదంబరంలతో భేటీ అయి పలు విషయాలపై చర్చిస్తారు. ఇక దేశంలోకెల్లా అత్యధిక పేదరికం శాతం నమోదైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్నిఆయన సందర్శిస్తారు. భారత్ పురోభివృద్ధి పయనంలో ఎదురవుతున్న సవాళ్లపై ఆయన సమాచారం సేకరిస్తారని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News