: ఐబీ తప్పుడు నివేదికలు పంపే అవకాశం: దామోదర్ రెడ్డి


రాయల తెలంగాణ అంశంపై కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు పార్టీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఐబీ అధికారులు కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపే అవకాశం ఉందని అన్నారు. రాయల తెలంగాణ అంశం హైకమాండ్ గేమ్ ప్లాన్ లో భాగమని తాను అనుకోవడం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరేందుకు త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News