: ఎక్కువ మంది 'నోటా' ఇస్తే మళ్లీ పోలింగ్ కుదరదు


పోలింగ్ లో ఎక్కువ మంది ఓటర్లు 'పై అభ్యర్థులు ఎవరూ కాద'నే ఆప్షన్ (నోటా) ఇస్తే అక్కడ తిరిగి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. అయితే, ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. దీనిపై చట్టం చేయాల్సి ఉంటుందని, అయినా ఇప్పుడే ఆ ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ నచ్చనప్పుడు నన్ ఆఫ్ ద అబోవ్ (నోటా) ఎంచుకునేందుకు వీలుగా ఒక మీటను ఈవీఎం మిషన్ లో ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మిజోరంలో ఎలక్షన్ కమిషన్ ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తోంది.

  • Loading...

More Telugu News