: సూర్యనెల్లి బాధితురాలిని మేం రావద్దనలేదు: ఫాదర్ ఫ్రాన్సిస్
సూర్యనెల్లి సామూహిక అత్యాచార బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని చర్చికి రావద్దని ఆదేశించినట్టు వస్తున్న వార్తలను కేరళ చర్చి కొట్టిపారేసింది. బాధితురాలి తల్లి చెప్పిన విషయాలు అవాస్తవాలని ఆ చర్చి మత గురువు ఫాదర్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.
బాధితురాలి తల్లి ఈ రోజు ఉదయం మాట్లాడుతూ, మూడువారాల కిందట, చర్చికి హాజరుకావద్దని తన భర్తను కురిచ్చిలోని క్యాథలిక్ చర్చి మత గురువు ఆదేశించారని వెల్లడించింది. అందుకు ప్రత్యేకమైన కారణాలేవీ పేర్కొనలేదని ఆమె తెలిపింది.
'అయితే, మాపై నిషేధం ఉందని వాళ్లు స్పష్టంగా చెప్పలేదు. చర్చికి రావడం విరమించుకుంటే బాగుంటుంది, అని కొంచెం కటువైన గొంతుకతో చెప్పారంతే' అని వివరించింది. ఈ నేపథ్యంలో కురిచ్చి చర్చి మత గురువు స్పందించారు. ఈ ఆరోపణలన్నీ నిరాధారం అని స్పష్టం చేశారు.