: సోనియా, కేసీఆర్ ల నాటకమే 'రాయల తెలంగాణ': మోత్కుపల్లి


రాయల తెలంగాణపై అభిప్రాయం తెలపాలంటూ టీ.టీడీపీ, టీ.కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐబీ ఫోన్ చేయడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో, ఐబీ నుంచి తనకు కూడా ఫోన్ వచ్చిందని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి తెలిపారు. మళ్లీ తెలంగాణ విషయాన్ని నాన్చడానికే కేంద్రం రాయల తెలంగాణ అంశాన్ని లేవనెత్తిందని విమర్శించారు. సోనియా, కేసీఆర్ ల కొత్త నాటకమే రాయల తెలంగాణ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం వేగంగా అడుగులు వేయడం లేదని మోత్కుపల్లి అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే టీడీపీ కోరుకుంటోందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News