: మహిళలపై జరుగుతున్న నేరాల వల్ల మనం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది: సోనియాగాంధీ


మహిళలపై సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, దారుణాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, నేరాలవల్ల మహిళలు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు త్వరలో సభలో ఒక బిల్లు ఆమోదం పొందుతుందన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హర్యానాలోని భగత్ పూల్ సింగ్ మహిళా యూనివర్శిటీ, మహిళా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సోనియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మహిళల కోసం బడ్జెట్ లో ప్రతిపాదించిన వెయ్యి కోట్లతో మహిళా బ్యాంకు, 'నిర్భయ' నిధిని ఆమె గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News