: బెంగళూరులో 1,000 ఏటీఎంలకు తాళాలు


భద్రత లేని కారణంగా బెంగళూరు నగరంలో 1,000 ఏటీఎం కేంద్రాలను పోలీసులు ఆదివారం రాత్రి మూసివేశారు. కొన్ని రోజుల క్రితం ఒక ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లిన మహిళా బ్యాంకు మేనేజర్ పై దుండగుడు కత్తితో దాడి చేసి దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులను ఆదేశించింది.

అన్ని కేంద్రాలలో లోపల, బయట సీసీటీవీ కెమేరాలు, అలారమ్ హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరింది. ఇందుకోసం నగర పోలీసులు ఇచ్చిన గడువు ఆదివారం సాయంత్రం 4 గంటలతో ముగిసిపోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రతా చర్యలు ఏర్పాటు చేయని ఏటీఎం కేంద్రాలను మూసివేయాలని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఔరాద్కర్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో 1,000 ఏటీఎం కేంద్రాలను పోలీసులు రాత్రి మూసివేశారు.

  • Loading...

More Telugu News