: రాయల తెలంగాణపై ఐబీ అభిప్రాయాలు కోరడం దారుణం: దామోదరరెడ్డి
రాయల తెలంగాణపై ఐబీ అభిప్రాయాలు కోరడంపై తెలంగాణ ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదరరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో మళ్లీ కొత్తగా రాయల తెలంగాణపై అభిప్రాయాలు కోరడమేమిటని ప్రశ్నించారు. టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈ రోజు ఐబీ ఫోన్లు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణకు తాము ఒప్పుకోమని దామోదరరెడ్డి స్పష్టం చేశారు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.