: హైదరాబాద్ ను కమ్మేసిన పొగమంచు... విమాన రాకపోకలకు అంతరాయం


ఈ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ ను పొగమంచు కమ్మేసింది. కనుల ముందు కమనీయమైన దృశ్యం ఆవిష్కృతమవడంతో హైదరాబాద్ వాసులు సరికొత్త అనుభూతికి లోనయ్యారు. అయితే, ఈ పొగమంచు కారణంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రన్ వే సరిగ్గా కనిపించకపోవడంతో, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, తిరుపతి, విశాఖ, ఢిల్లీ, బెంగళూరు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News