: విశాఖ వండేలో విండీస్ విజయం
విశాఖపట్నంలో ఈ రోజు జరిగిన వండే మ్యాచ్ ను వెస్టిండీస్ ఎగరేసుకుపోయింది. చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో భారత్ పై విండీస్ విజయం సాధించింది. 289 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆటగాళ్ళు మరో మూడు బంతులు మిగిలివుండగానే విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. చివరి వరకూ క్రీజులో నిలబడిన డారెన్ స్యామి 63 పరుగులు చేసి, విండీస్ ను విజయతీరాలకు చేర్చాడు.