: మోడీ హత్య కుట్రలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హత్యకు పన్నిన కుట్రను ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని రాయ్ పూర్ లో ఇద్దరు సిమి ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా నిధుల బదలాయింపు జరిగిందని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ సయీద్ అబ్దుల్ జలీల్(50), అజహరుద్దీన్ షంషుద్దీన్ ఖురేషీ(19) లను బీహార్ లో నరేంద్ర మోడీ ర్యాలీ సందర్భంగా జరిగిన బాంబు దాడి, బుద్ధ గయలో జరిగిన బాంబు దాడుల కేసుల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.