: చంద్రబాబు ప్రెస్ మీట్స్ కే పరిమితం: అంబటి


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్స్ జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ లో కూర్చుని ప్రెస్ మీట్స్ కు మాత్రం పరిమితమయ్యారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటిస్తూ వైఎస్ జగన్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. రాష్ట్రపతిని కలిసే హక్కు ఎవరికైనా ఉందని చెప్పిన అంబటి, టీడీపీ నేతలు విమర్శలే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీమాంధ్రలో టీడీపీకి రాజకీయ సమాధి తప్పదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News