: రెండు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 27/2
వెస్టిండీస్ ను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత బౌలర్లు రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్ మూడో ఓవర్లోనే ఛార్లెస్ ను రిటర్న్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. ఆరో ఓవర్లో శామ్యూల్స్ ను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మోహిత్ శర్మ చక్కని బంతితో అవుట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు ఎనిమిది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. క్రీజులో పావెల్(19), బ్రావో(1) ఉన్నారు.