: ఈతకు వెళ్లి అనంతలోకాలకు చేరిన ఇద్దరు విద్యార్థులు


అదిలాబాద్ జిల్లా సిర్పూర్ టి మండల కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఏడో తరగతి విద్యార్థులు డివి ప్రసాద్(13), విద్యాసాగర్(13) చెక్ డ్యాంలో ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందారు. భోజనానికి వెళ్లిన విద్యార్థులు అక్కడ్నుంచి చెక్ డ్యాం వద్ద ఈతకొట్టేందుకు ప్రయత్నించారు. వారిలో ఒక విద్యార్థి మునిగిపోతుండడంతో అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్ధి సైతం మృతి చెందాడు. దీన్ని గమనించిన స్థానికులు ఉపాధ్యాయులకు సమాచారమందించారు. అనంతరం విద్యార్ధుల మృత దేహాలను వెలికి తీశారు.

  • Loading...

More Telugu News