: రాణించిన రాంపాల్.. టీమిండియా 240/6
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో వన్డే రసవత్తరంగా సాగుతోంది. విండీస్ బౌలర్ రవి రాంపాల్ రాణించడంతో టీమిండియా స్వేచ్ఛగా బ్యాటు ఝళిపించలేదు. రవి రాంపాల్ భారత జట్టులోని కీలకమైన నాలుగు వికెట్లు తీయడంతో 45 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. రాంపాల్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి కోహ్లీ సెంచరీ కొద్దిలో మిస్ అవ్వగా, రాంపాల్ వేసిన గుడ్ లెంగ్త్ బాల్ ను అర్థం చేసుకోలేని జడేజా(10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.