: ఏకపక్ష విభజన దేశానికి మంచిది కాదు: నవీన్ పట్నాయక్
ఏక పక్ష విభజన దేశానికి మంచిది కాదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. భువనేశ్వర్ లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్, నవీన్ పట్నాయక్ ను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ విభజన ప్రజామోదం మేరకు జరగాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రజాభిప్రాయసేకరణ జరగాలని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం విభజించడం ఆమోదయోగ్యం కాదని నవీన్ పట్నాయక్ అన్నారు. జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సూచించారు.