: యానాం హక్కులను కాపాడుతాం: కేంద్ర మంత్రి నారాయణ స్వామి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం హక్కులను కాపాడుతామని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు వి నారాయణస్వామి అన్నారు. యానాంలో హెలెన్ తుపాను నష్టప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన అన్ని నివేదికలు తమకు అందాయన్నారు. పుదుచ్చేరిలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. శాంతి భద్రతలను గవర్నర్ పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. యానాంకు సరఫరా అయ్యే తాగునీరు, విద్యుత్, రవాణా తదితర అంశాలను జీవోఎం సహచరులతో చర్చించినట్టు నారాయణస్వామి తెలిపారు.