: ఢిల్లీకి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల బృందం


రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలిసేందుకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల బృందం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో వీరి అప్పాయింట్ మెంట్లపై స్పష్టత రానున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేసిన సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు తమ బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని ప్రభుత్వంతో అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. దీనికనుగుణంగా ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ ను రాష్ట్రపతి, ప్రధాని అప్పాయింట్ మెంట్ తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. సచివాలయ ఉద్యోగుల ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించాలని ఇప్పటికే మంత్రి శైలజానాథ్ ను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ మేరకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం 15 మంది ప్రతినిధుల జాబితాను సాధారణ పరిపాలన శాఖకు అందజేసింది. ఈ వారంలో అప్పాయింట్ మెంట్లు ఖరారైతే ఈ బృందం ఢిల్లీ వెళ్లనుంది.

  • Loading...

More Telugu News