: కోర్టుకు వెళ్లనున్న తరుణ్ తేజ్ పాల్
తనపై జరుగుతున్న కేసు విచారణ అంశంలో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఈ కేసు విచారణను ఏదయినా స్వతంత్ర న్యాయ వ్యవస్థకు బదిలీ చేయాలని ఆయన కోరనున్నారు. గోవా పోలీసులపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గోవా పోలీసులెవరూ ఇంతవరకు తనను సంప్రదించలేదన్న తరుణ్ తేజ్ పాల్ న్యాయవాది, నిష్పాక్షిక విచారణ సాగుంతుందని ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు. అందుకే తాము కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు.