: జగన్ ను కలుసుకున్న కంటోన్మెంట్ మాజీ ఛైర్మన్


పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఛైర్మన్ జంపన ప్రతాప్ ఈ రోజు చంచల్ గూడ జైలులో కలిశారు. మధ్యాహ్నం సమయంలో ములాఖత్ ద్వారా జైల్లోకి వెళ్లిన ఆయన దాదాపు గంటకు పైగా జగన్ తో మాట్లాడారు.

త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని చూస్తున్న జంపన, తన రాజకీయ భవిష్యత్ గురించి జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో అరెస్టైన జగన్ కొంతకాలంగా హైదరాబాదు చంచల్ గూడ జైల్లో రిమాండులో ఉంటున్న సంగతి తెల్సిందే. 

  • Loading...

More Telugu News