: శృతి హాసన్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్


ముంబైలోని బాంద్రాలో నటి శృతి హాసన్ పై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అశోక్ శంకర్ త్రిముఖే(45)గా గుర్తించారు. అతడు ఫిల్మ్ సిటీలో స్పాట్ బోయ్ గా పనిచేస్తున్నట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శివాజీ కోలేకర్ మీడియాకు తెలిపారు. తాను సోదరుడికి ఉద్యోగం కోసం శృతి హాసన్ ఇంటికి వెళ్లాలని.. తాను చెప్పడానికి ప్రయత్నిస్తుండగానే ఆమె డోర్ వేసేశారని శంకర్ పోలీసులకు చెప్పాడు. అంతేకానీ, ఆమెను బెదిరించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పాడు.

వాస్తవానికి బాంద్రా పోలీసుల కథనం ప్రకారం మంగళవారం ఉదయం 9.30గంటల సమయంలో నిందితుడు శంకర్ శృతి హాసన్ ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు. ఆమె తలుపుతీయగా.. తనను ఎందుకు గుర్తు పట్టలేదని ప్రశ్నించాడు. ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో శృతి హాసన్ నిందితుడిని గట్టిగా బయటకు నెట్టేసి తలుపు వేసేసింది.

  • Loading...

More Telugu News