: లోక్ అదాలత్ ప్రపంచ రికార్డు
లోక్ అదాలత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 39 లక్షల కేసుల పరిష్కారం దిశగా దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో శనివారం 28.26 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవా సంస్థ(నల్సా) సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మూడు ధర్మాసనాలు కలిపి 51 కేసుల్లో రాజీ కుదిర్చాయి. దీంతో జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించిన కేసుల సంఖ్య ప్రపంచ రికార్డని నల్సా తెలిపింది.