: భువనేశ్వర్ చేరుకున్న జగన్
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా, సమైక్యానికి మద్దతివ్వాలని జాతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒడిశాలోని భువనేశ్వర్ చేరుకున్నారు. కాసేపట్లో జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. విభజనపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై నవీన్ పట్నాయక్ కు వివరించనున్నారు. విభజన వల్ల వచ్చే నష్టాలను కూడా ఆయనకు జగన్ విశదీకరించనున్నారు.