: కాలువలో శవమై తేలిన పదో తరగతి హాస్టల్ విద్యార్థిని
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం జరిగింది. ప్రియాంక అనే పదో తరగతి హాస్టల్ విద్యార్థిని కాలువలో శవంగా తేలింది. ఈ నెల 19 నుంచి ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. పాలకొల్లులోని ఇబ్రహీం ఎయిడెడ్ పాఠశాల హాస్టల్ లో ఉంటూ ప్రియాంక పదో తరగతి చదువుతోంది. దీంతో పోలీసులు ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్ తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.