: గుండెచప్పుడు లయ తప్పుతోందా.. వాటిని చెక్‌చేయాలి!


గుండె చప్పుడు లయ తప్పుతున్నట్లయితే దానికి కారణమైన సమస్య గుండె దగ్గరే ఉన్నదని మనం అనుకుంటాం. అయితే.. శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉండే సూక్ష్మ రక్తనాళాల పనితీరు కూడా ఇందుకు దారితీస్తుండవచ్చునని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. రెటీనా, మూత్రపిండాల్లో ఉండే సూక్ష్మరక్తనాళాలు దెబ్బతినేవారిలో గుండెకొట్టుకోవడంలో కూడా తేడా వస్తుందని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ అధ్యయనంలో భాగంగా వైద్యులు దాదాపు పదివేల మంది నడివయసు వారిని పరిశీలించారు.

ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన గుండె ముప్పులను వీరు గుర్తించారు గానీ. .. అంతిమంగా తేల్చినదేంటంటే.. రెటీనా మరియు మూత్రపిండాల వద్ద సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిన్న వారిలో గుండెకు సంబంధించిన ముప్పులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ అనే సమస్య కొందరిలో పక్షవాతం ముప్పును పెంచుతుందని, గుండెనొప్పి సమస్యలకు కూడా కారణం అవుతుందని శాస్త్రవేత్తలు నిర్ధరించారు.

  • Loading...

More Telugu News