: భారతే మా ప్రధాన లక్ష్యం: జైషే మహ్మద్


ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత ఇక భారత దేశమే తమ ప్రధాన లక్ష్యం అవుతుందని నిషిద్ధ తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ నాయకుడు అస్మతుల్లా మువయ్యా హెచ్చరించాడు. ఇటీవల హైదరాబాద్ లో పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులను అస్మతుల్లా కొనియాడాడు. ఉరితీతకు గురైన అజ్మల్ కసబ్, అప్జల్ గురులను కీర్తించాడు.

గతంలో అల్ ఖైదా కమాండర్ గా వ్యవహరించిన అస్మతుల్లా తాజాగా ఓ ప్రకటన విడుదల చేశాడు. అమెరికా దళాలు ఆఫ్గాన్ ను ఖాళీ చేస్తే జిహాదీ గ్రూపులు కాశ్మీర్ పై దృష్టి పెడతాయని పేర్కొన్నాడు. అప్పుడు భారత్ లో మరిన్ని దాడులు చోటు చేసుకుంటాయని స్పష్టం చేశాడు.

కాగా, అస్మతుల్లా తన ప్రకటనలో ఐఎస్ఐతో మిలిటెంట్ గ్రూపులకు సంబంధం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు.  ఐఎస్ఐ.. జిహాదీ గ్రూపులను నియంత్రించడంలో విఫలమైందని పేర్కొన్నాడు. దీంతో, ఐఎస్ఐ..  తీవ్రవాద సంస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్న విషయం తేటతెల్లమైంది. 

  • Loading...

More Telugu News