: సచివాలయం కేంద్రంగా భూదందా: హరీష్ రావు


రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం కేంద్రంగా ప్రభుత్వం భూదందాకు తెరతీసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, విలువైన ప్రభుత్వ భూములను తమ వర్గం వారికి సీఎం కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ బినామీల పేర్లకు భూమార్పిడి జరుగుతోందని రాష్ట్రంలో భూమి విలువ ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, విశాఖపట్టణం లాంటి నగరాల్లో యధేచ్ఛగా ఈ దందా సాగుతోందని చెప్పారు. హైదరాబాద్ లో ప్రభుత్వ రంగ సంస్థ ఆగ్రోస్ కు కేటాయించిన భూమిని సైతం రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. మొత్తం భూ వ్యవహారంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News