: భార్యపై కత్తి దూసిన భర్త
కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కత్తితో భార్య గొంతు కోసి చంపిన ఘటన గుంటూరు జిల్లా నరసరావు పేటలోని ఏనుగుల బజార్ లో చోటు చేసుకుంది. ప్రైవేటు వైద్యశాలలో పని చేస్తున్న సత్యనారాయణ రాజు భార్య విజయలక్ష్మి(25)పై అనుమానం పెంచుకుని కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన విజయలక్ష్మి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.