: మీడియా ముందుకు వంద కోట్ల మోసగాడు
ఇళ్ల స్థలాలు, అపార్ట్ మెంట్ల పేరిట అనేక మందిని నిలువునా ముంచిన రియల్టర్ నార్ల వంశీకృష్ణను విజయవాడ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వంశీకృష్ణపై గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీస్ స్టేషన్లలో 20కి పైగా కేసులు ఉన్నాయి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం వల్లే వంశీకృష్ణ మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. వంశీకృష్ణ బాధితులకు న్యాయం చేసేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు.