: పాకిస్థాన్ పైలట్ కు 9 నెలల జైలు శిక్ష
మద్యం సేవించి విధులు నిర్వర్తించబోయిన పాకిస్థాన్ విమాన పైలట్ కు లండన్ కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. సెప్టెంబర్ 18న లీడ్స్ బ్రాడ్ ఫోర్డ్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాన్ని నడిపేందుకు వెళ్లబోయిన ఇర్ఫాన్ పైజ్ (55) అనే పైలెట్ మద్యం తీసుకున్నట్లు అక్కడి వారు గుర్తించారు. వెంటనే భద్రతాధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో, పైలెట్ ను అరెస్టు చేసి లీడ్స్ క్రౌన్ కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం సేవించి విమానం నడపడం తీవ్రమైన నేరంగా పరిగణించిన జస్టిస్.. పైలెట్ కు శిక్ష విధించారు. ఆయన నడపబోయిన విమానంలో 145 మంది ప్రయాణికులు, పదకొండు మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు.