: లిఫ్ట్ లో సీసీ కెమెరా లేదు.. తేజ్ పాల్ కేసులో షాకిచ్చిన గోవా పోలీసులు
సంచలనం సృష్టించిన 'తెహెల్కా' వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ అత్యాచార యత్నం కేసులో గోవా పోలీసులు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. తేజ్ పాల్ తన సహ ఉద్యోగినిపై అత్యాచారానికి యత్నించిన ఫైవ్ స్టార్ హోటల్ లిఫ్టులో సీసీ కెమెరా లేదని తెలిపారు. అయితే, సమాచారం కోసం ఇతర కెమెరాల ఫీడ్ ను పరీక్షిస్తున్నామని పనాజీ డీజీపీ మిశ్రా తెలిపారు. తెహెల్కా ఉద్యోగిని పంపిన ఈ మెయిల్స్ కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. సరైన ఆధారాలు దొరికితే తప్ప నిందితుడిని అదుపులోకి తీసుకోలేమని చెప్పారు.