: పశ్చిమగోదావరి జిల్లాలో 500 కోట్ల రూపాయల నష్టం


హెలెన్ తుపాను వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఏలూరులో కలెక్టర్ మాట్లాడుతూ, తుపాను వల్ల లక్ష హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని, 170 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఉపాధి హామీ కూలీల ద్వారా త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News