: టెస్ట్ ట్యూబ్ ట్విన్స్
టెస్ట్ ట్యూబ్ విధానంలో అరుదుగా కేరళలోని తిరువనంతపురంలో ఒక మహిళ కవలలకు జన్మనిచ్చింది. 32 ఏళ్ల వీఎస్ నిఖిల ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు బేబీలను కన్నది. దక్షిణాదిన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానంలో ఒక మహిళ కవలలకు జన్మనివ్వడం ఇదే మొదటిసారి. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానంలో ఒక ప్రభుత్వాస్పత్రి ఈ విజయం సాధించడం చెప్పుకోతగ్గదిగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎలిజబెత్ అన్నారు.